Akhanda-2: అఖండ- 2 లో బాలీవుడ్ బ్యూటీ పాత్రపై క్లారిటీ 15 d ago

మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అఖండ 2 - తాండవం తెరకెక్కుతోంది. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ ఓ ప్రధాన పాత్రలో నటించబోతుందని తెలుస్తోంది. అయితే ఈ చిత్రం లో ఆమె నటించడం లేదని క్లారిటీ ఇచ్చింది మూవీ టీం. ఇక అఖండ 2లో యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ మే చివరికి ముగించాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.